గెలుపు భారత క్రికెటర్లదే
ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఛాంపియన్ ట్రోఫీ స్పాన్సర్‌షిప్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒప్పంద పత్రాల నుంచి రెండువివాదాస్పదమైన నిబంధనలను తొలగించడానికి ఐసిసిఅంగీకరించింది. దీంతో ఐసిసి ఛాంపియన్ ట్రోఫీకి భారత్ పూర్తి స్థాయి జట్టును పంపేందుకువీలు ఏర్పడింది.
సమస్య పరిష్కారమైనప్పటికీ ఢిల్లీలో తలపెట్టిన బిసిసిఐ అత్యవసర సమావేశం జరుగుతుంది. ఆటగాళ్లు నేరుగా బోర్డుతో చర్చించడానికి నిరాకరించడంపై ఈ సమావేశంలో దృష్టి పెడతారు. నెల రోజుల క్రితం ఎంపిక చేసిన భారత పూర్తి స్థాయి జట్టుకు శనివారం ఆమోద ముద్ర వేస్తారు.












Click it and Unblock the Notifications
