వై.ఎస్. కు ఆరోగ్య మంత్రి సవాల్
హైదరాబాద్‌ః పనికి ఆహారంపథకంలో తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. పనికి ఆహారపథకంలో నాగం జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని, చంద్రబాబు వారిని కూడా క్యాబినెట్ నుంచి తప్పించాలని సి.ఎల్.పి. నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డిడిమాండ్ చేసిన విషయం విదితమే. ఈ డిమాండ్ కు మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలు రుజువుచేస్తే నేను రాజకీయాలనుంచి తప్పుకుంటాను... రుజువు చేయలేకపోతే వైఎస్. తప్పుకుంటారా అని ఆయనసవాల్‌విసిరారు.












Click it and Unblock the Notifications
