నిజామాబాద్ లో దొంగల బీభత్సం
నిజామాబాద్‌ః నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆదివారం వేకువజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏడోనెంబర్ జాతీయ రహదారి వెంట వున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై 20 మంది దొంగలు విరుచుకుపడ్డారు. దుండగులు ఆస్పత్రి డాక్టర్ కస్తూరీ బాయిని తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్తరిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఆస్పత్రిలోనిపేషెంట్లు అందరినీ గదుల్లో బంధించిన దుండగులు మూడు గంటల పాటు ఆస్పత్రిలోస్వైరవిహారం చేశారు. అందిన మేరకు దోచుకున్నారు.












Click it and Unblock the Notifications
