చల్లారని భారత్‌-పాక్‌ చిచ్చుః అన్నన్‌

ఐక్యరాజ్యసమితిః భారత - పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను ప్రపంచం ఎదుర్కొంటున్న నాలుగు ప్రమాదాల్లో ఒకటని ఐక్యరాజ్యసమితి సారధి కోఫి అన్నన్‌ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇంకా సున్నితంగానే వున్నదని, మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తితే అంతర్జాతీయ సంస్థల జోక్యం అవసరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితిసర్వసభ్య సమావేశంలో చేసే ప్రసంగం ప్రతిని అన్నన్‌ విడుదల చేశారు.అందులో ఆయన భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. ఇరాక్‌ పై అమెరికా ఒంటెద్దు పోకడ పోతున్నదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. పాలస్తీనా,ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌, భారత-పాక్‌ సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటున్నదని అన్నన్‌ చెప్పారు. అన్నన్‌ ఐక్యరాజ్యసమితిసర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి గురువారం సాయంత్రం ప్రసంగిస్తారు. భారత పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని చెబుతున్నా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+