ఆన్ లైన్ లో బి.ఇడి. అడ్మిషన్లు
విశాఖపట్నంః బి.ఇడి.కళాశాలల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పించే ఎడ్‌సెట్ ఫలితాలను గురువారం ప్రకటించారు. 2.34 లక్షల మంది ఈ పరీక్షరాశారు. వారిలో 2.09 లక్షల మంది అర్హులయ్యారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ సారి ఆన్ లైన్ లో బి.ఇడి. అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆంధ్రావిశ్వవిద్యాలయం వి.సి. ప్రొఫెసర్ సింహాద్రి ప్రకటించారు. రాష్ట్రంలోనివిశాశపట్నం, వరంగల్, హైదరాబాద్, గుంటూరు, తిరుపతిల్లో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఎంసెట్ అడ్మిషన్లు మాత్రమే ఇంతవరకు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి బిఇడి అడ్మిషన్లు కూడా ఆన్ లైన్ లో నిర్వహించడం వల్ల పారదర్శకత, వేగంపెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
