9/11 దాడులు: బాధితులతో బుష్
న్యూయార్క్: నిరుడుసెప్టెంబర్ 11వ తేదీ ఉగ్రవాద దాడుల బాధితులను అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ఓదార్చారు. లోయర్ మాన్‌హటన్‌లోని గ్రౌండ్ జీరో వద్ద గుమికూడిన వందలాది మంది బాధితులను ఆయన వ్యక్తిగతంగా పరామర్శించారు.
వాషింగ్టన్,పెన్సిల్వేనియాల్లోని స్మారక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కరచాలనం చేస్తూ, గుండెకు హత్తుకుంటూ, సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన బాధితులను పలకరించారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. వారితో కలిసి ఫొటోలు దిగారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం గం.8.46 నిమిషాలకు బైబిల్ పఠనానికి, మౌనం పాటించడానికి ఉద్దేశించిన ప్రయివేట్ చర్చి సందర్శనతో బుష్ కార్యక్రమం మొదలైంది. ఈ సమయానికి నిరుడుఅక్టోబర్ 11వ తేదీన టెర్రరిస్టుల మొదటివిమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications
