9/11దాడులు: అమరజ్యోతితో స్మరణ
న్యూయార్క్: ఉగ్రవాద దాడుల్లో మృతి చెందినవారి స్మారకార్థం వెలిగించిన అమరజ్యోతి వద్ద 91 దేశాల నేతలతో పాటు భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సంతాపం ప్రకటించారు. వాజ్‌పేయితో పాటు ప్రపంచ దేశాల నేతలు తమ తమ జాతీయ జెండాల వద్ద నిలబడి మృతులను స్మరించుకున్నారు.
అనంతరం ప్రతి ఒక్కరూ క్యాండిల్ ప్రదానం చేశారు. ఈ అమరజ్యోతి వద్ద మృతుల స్మారకచిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఉగ్రవాద దాడుల్లో 2,801 మంది మరణించారు. ఇందులో వంద మంది భారతీయులు ఉన్నారు. అమెరికా, ది బ్యూటిఫుల్‌అంటూ ఆలపిస్తన్నప్పుడు ప్రపంచ నేతలు క్యాండిల్స్ పట్టుకుని నిలబడ్డారు. గ్రౌండ్ జీరో వద్ద గాలిపెద్దగా వస్తుండడంతో వాటిని ఆ సమయంలో వెలిగించలేదు.
ఈ కార్యక్రమానికి ముందు ఎయిర్ ఫోర్స్ జెట్స్ పార్క్‌పైన ఆకాశంలోవిహరించాయి. సెప్టెంబర్ 11వ తేదీ దాడుల సందర్భంగా రోజంతా నిర్వహించిన కార్యక్రమాలు గ్రౌండ్ జీరో వద్ద మృతులను స్మరించుకునే కార్యక్రమంతో ముగిశాయి.
ప్రపంచ నేతలు పెద్ద యెత్తున రావడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నేషనల్ గార్డ్స్‌తో స్థానిక పోలీసు బలగాలను పటిష్టం చేశారు.స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్స్‌ను, ఎఫ్‌బిఐ ఏజెంట్లను, బయో- టెర్రరిజం నిపుణులను నియోగించారు.ఫైటర్ ప్లేన్స్ ఆకాశంలో గస్తీ తిరిగాయి.












Click it and Unblock the Notifications
