భారత బాధితులను ఓదార్చిన వాజ్‌పేయి
న్యూయార్క్: నిరుడుసెప్టెంబర్ 11వ తేదీ ఉగ్రవాద దాడుల్లో తమ బంధువులను కోల్పోయిన భారత కుటుంబాలను ప్రధాని వాజ్‌పేయి పరామర్శించారు. ఆ కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. వారిని చూసి ప్రధాని చలించిపోయారు.
ప్రధానిని చూడగానే కడుపులో దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన కొందరు ఆయన పక్కన కూర్చుని తమ బాధనువిన్నవించుకున్నారు. ఆ దాడిలో భర్తలను, తండ్రులను, కొడుకులను, కూతుళ్లను కోల్పోయిన భారతీయులు తమ వేదనను ప్రధానితో పంచుకున్నారు. ఓ పాప దుఃఖాన్ని ఆపుకోలేక బోరునవిలపించింది. ఓ పాను తనతో పాటు తిప్పి ప్రధాని ఆ పాపను తల్లి దగ్గరకు చేర్చారు. తీవ్రదాద దాడుల భయానక స్థితిని వారు ప్రధానికివివరించారు. తాము ఈ పరిణామాలను ఎలా భరిస్తున్నామో చెప్పుకున్నారు.
ఉగ్రవాద సమస్యను ప్రపంచానికి తెలియజేసిన సంఘటనగాసెప్టెంబర్ 11 దాడులను ప్రధాని చెప్పారు. ఉగ్రవాదానికి చాలా కాలంగా భారత్ లక్ష్యంగా మారిందని, ఈవిషయాన్ని పదే పదే చెప్పినా ప్రపంచం పట్టించుకోలేదని, ఈ ప్రమాదం గురించి ఇతర దేశాలను తాము హెచ్చరించామని కూడా ఆయన చెప్పారు.
బాధిత కుటుంబాలకు చెందిన దాదాపు 20 మంది ప్రధానిని కలుసుకున్నారు. అమెరికా పర్యటన సందర్భంగా తాను భారతదేశానికే కాకుండా ప్రపంచం యావత్తుకు ఉగ్రవాదం ఏ విధంగా సమస్యగా మారిందో తాను చెప్పానని, అయితే తన మాటలను ఎవరూ పట్టించుకోలేదని వాజ్‌పేయి అన్నారు. ఉగ్రవాదులకు తమ దేశం చాలా దూరమని, అమెరికాను వారేమీ చేయలేరని ఒక ప్రముఖ అమెరికన్ తనతో అన్నారని, దూరం ఉగ్రవాదులకుపెద్ద అడ్డంకి కాదని సెప్టెంబర్ 11 దాడులు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
