ప్రమాదం: మృతుల సంఖ్య125పైనే
పాట్నా: బీహార్‌లో జరిగిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 125కు చేరుకుంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని అధికారులు అంటున్నారు.
గురువారంనాటికి కూడా బోగీల నుంచి మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు. ప్రమాదం సోమవారం రాత్రి జరిగినవిషయం తెలిసిందే. పట్టాలు తిప్పి వంతెనపై నుంచి ధావే నదిలోకి వేలాడుతున్న రెండు బోగీల్లో మృతదేహాలు ఇంకా ఉన్నాయని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు 120 మృతదేహాలను వెలికి తీశారు. గత రెండు రోజులుగా గయా, ఔరంగాబాద్, రఫీగంజ్ ఆస్ప్రత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో పది మంది మరణించారు. ఈవిషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. బుధవారం ఉదయం నుంచి 25 మృతదేహాలను రఫీగంజ్‌స్టేషన్‌లో పడి ఉన్నాయి. పట్టాలు తప్పిన రైలులో 526 మంది ప్రయాణికులు, 53 మందిరైల్వే ఉద్యోగులు ఉన్నారని తూర్పు రైల్వే అధికారుంటున్నారు.వీరిలో ఎంత మంది బతికి ఉన్నారనే విషయం కచ్చితంగా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications
