పెళ్ళికి ముందు ఎచ్.ఐ.విపరీక్ష?
హైదరాబాద్:పెళ్ళికి ముందు వధూవరులు తప్పకుండా ఎచ్.ఐ.వి పరీక్ష జరిపించుకునేలా రాష్ట్రప్రభుత్వం త్వరలో ఓ చట్టం తీసుకురానుంది. రాష్ట్రంలో ఎచ్.ఐ.వి కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. భారతదేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్యలో రాష్రం సాధిస్తోన్న ప్రగతినిఅరికట్టాలని నడుం బిగించింది.
అందుకే పెళ్ళికి ముందు యువతీయువకులు ఎచ్.ఐ.వి పరీక్ష జరుపుకోవడం తప్పనిసరి చేసేలా చట్టం రూపొందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాధి వేగంగా ప్రబలుతోంది.సెక్స్ వర్కర్ ల లోనే కాకుండా..సాధారణ పౌరులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.విజయవాడలో ప్రతి పదిమంది గర్భిణిలో ఒకరు ఎయిడ్స్ రోగులుగా గుర్తించారు. గుంటూరు, ప్రకాశంలో లో ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉంది.












Click it and Unblock the Notifications
