మళ్ళీ సీఎం ఆకస్మికపర్యటనలు!
ఒంగోలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు తనకెంతో ఇష్టమైనఆకస్మిక పర్యటన కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. శుక్రవారం పశ్చిమగోదావరిజిల్లాలో శ్రీకారం చుట్టిన చంద్రబాబు శనివారం కూడా కంటిన్యూచేశారు. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలోని ఒంగోలుపరిసరప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు జరిపారు.
ఒంగోలు పట్టణంలో మురుగుకాల్వల స్థితినిపర్యవేక్షించారు. రోడ్లపైనే మురుగునీరు పారుతుండడంతోమున్సిపల్ అధికారులను ఆక్షేపించారు. ఆ తర్వాత రైతు బజార్‌ను సందర్శించారు. రైతుబజార్ లో రైతులు కాకుండావ్యాపారులు కూరగాయాలు అమ్ముతుండడంతో వ్యవసాయఅధికారులపై సీఎం మండిపడ్డారు. రైతుబజారులు కేవలం రైతులకే పరిమితం కావాలనిఆయన ఆదేశించారు. అనంతరం ఆయన తిరుపతబయలుదేరారు.












Click it and Unblock the Notifications
