జింబాంబ్వేపై భారత్‌ విజయం

కాండీ: ఐసిసి ఛాంపియన్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ లో భాగంగా శనివారం జింబాబ్యే- భారత్‌ ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ లో భారత్‌ విజయం సాధించింది. జింబాబ్యే జట్టుపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆండీప్లవర్‌ 145 పరుగులతో భారత్‌ కు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినప్పటికీ చివరికి భారత్‌ దే పైచేయి అయింది.మహమ్మద్‌ కైఫ్‌, రాహూల్‌ ద్రావిడ్‌ ల వీరోచిత బ్యాటింగ్‌వల్ల భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులుచేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 88పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతుకష్టాల్లో కూరుకుపోయింది. వీరేంద్ర సెవహగ్‌ చెలరేగి 36 బంతుల్లో 48 పరుగులుచేసినప్పటికీ, సచిన్‌, గంగూలి, యువరాజ్‌ సింగ్‌ లువెంటవెంటనే ఔటయ్యారు.


జింబాబ్యే ఫాస్ట్‌ బౌలర్‌ డగ్లస్‌ హొండో విరుచుకుపడి 4వికెట్లు తీశాడు. అయితే, ద్రావిడ్‌, కైఫ్‌లభాద్యతాయుతమైన బ్యాటింగ్‌ తో పరిస్థితినిచక్కదిద్దారు. ద్రావిడ్‌ కు కైఫ్‌ అండగా నిలవడంతోవీరి ఇరువురూ కలిసి ఐదో వికెట్‌ కు 100 పరుగులకుపైగా సాధించారు.

204 పరుగుల వద్ద ద్రావిడ్‌ రనౌట్‌ కావడంతో పరిస్థితిమళ్ళీ మొదటికొచ్చినట్లు కనిపించింది. అనిల్‌కుంబ్లే కైఫ్‌ కు అండగా నిలిచి బ్యాటింగ్‌ అవకాశాన్నికైఫ్‌ కే ఇవ్వడంతో ఇండియా భారీ స్కోర్‌ సాధించింది.కైఫ్‌ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.కుంబ్లే 18 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+