మెదక్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఆగ్రహించిన రైతులు డి.ఇ. కార్యాలయాన్ని ముట్టడించిఘెరావ్ చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇద్దరు రైతులు డి.ఇ. ఛాంబర్‌లోనే ఆత్మహత్యకు యత్నించారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిధిలోని చిన్న ఘనపూర్‌స్టేషన్‌లోని రంగంపేట ఫీడర్ ద్వారా సంగాయిపేట, రంగంపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, మాందాపూర్,సదాశివనగర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది.ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల ట్రాన్స్‌ఫారమ్ కాలిపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. దీంతో సంగంపేట గ్రామానికి, గిరిజన తండాల రైతులు శుక్రవారం ట్రాక్టర్లలో వచ్చి మెదక్‌లోనిట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించిన రైతులను పట్టించుకోకుండా అధికారులు భోజనాలకు వెళ్లిపోయారు. ఆగ్రహించిన రైతులు అధికారులు తిరిగి రాగానే మూకుమ్మడిగా డి.ఇ. ఛాంబర్‌లోకి చొరబడ్డారు.