గుజరాత్‌ అల్లర్లు అప్రతిష్ట: వాజ్‌పేయి

న్యూయార్క్‌: ఇటీవల గుజరాత్‌ను కలవరపెట్టిన మతఘర్షణలను ప్రధాని వాజ్‌పేయి ఖండించారు. తాను ఎక్కడికి వెళ్లినా రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి ప్రస్తావిస్తన్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో సంభవించిన సంఘటనలు అంతర్జాతీయంగా భారతదేశానికి అప్రతిష్టను తెచ్చిపెట్టాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాయబారి లలిత్‌ మాన్‌సింగ్‌ న్యూయార్క్‌లో ఏర్పాటు చేసినవిందు కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అల్లర్లు గుజరాత్‌కు కొత్త కాదని, ప్రతి రెండేళ్లకు ఓసారి అలర్లు చెలరేగుతుంటాయని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు.

మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి నడుచుకుంటోందని,అందువల్లనే దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొన్నదని ఆయన అన్నారు. మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్‌ను అగ్రభాగాన నిలపాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సవాళ్లను, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. కారణమేదైనా అమాయక మహిళలను, పిల్లలను చంపడం సహించరాదని ఆయన అన్నారు. ఉల్లిగడ్డ ధరలపై ప్రభుత్వం మారిపోయిందని, ఇటువంటి విచిత్రదేశం భారత్‌ అని ఆయన అన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వ మార్పు అనేది ఆశ్చర్యకరం కాదని, అయితే వ్యవస్థ మార్పును ఆశించడంఅర్థం లేనిదని ఆయన అన్నారు.

ప్రభుత్వ మార్పు గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదని, ప్రస్తుత ప్రతిపక్ష స్థితి వల్ల తానేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలేఅంటున్నారని ఆయన అన్నారు. ప్రవాస భారతీయుల కృషి ఆయన అభినందించారు. భారతదేశం వెలుపల పని చేస్తున్న దేశీయులు అద్భుతాలు సృష్టిస్తున్నారని ఆయన కొనియాడారు. విదేశీ వ్యవహారాల మంత్రి యశ్వంత్‌ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+