అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురయ్యారు.వీరు తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవీంద్ర అనుచరులు.
రాప్తాడు మండలం పరిధిలోని గాండ్లపర్తి, వరిమడుగు గ్రామాల మధ్య రహదారి పక్కన ముళ్లపొదల్లో పొంచి ఉన్న కాంగ్రెస్ వర్గీయులు, కారు బాంబు నిందితుడు భానుకోట కిష్టప్పతో కలిసి మరో ఏడుగురు ద్విచక్రవాహనంపై వస్తున్న తెలుగుదేశం భానుకోట ఎంపిటిసి సభ్యుడు బాల మారుతి, అతని బావమరిది మండ్లి వెంకటేశులు, ఎల్‌ఐసి ఏజెంటుకె. వెంకటేశులపై బాంబులు వేసి, వెంటాడి తలలు నరికి హత్య చేశారు.