న్యూయార్క్: సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం మానుకోవాలని, జమ్మూ కాశ్మీర్‌లో హింసను రెచ్చగొట్టవద్దని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్‌కు గట్టిగా చెప్పారు.
ముషార్రఫ్‌ను బుష్ హెచ్చరించినవిషయాన్ని భారత జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రా విలేకరులతో చెప్పారు. ఈ విషయం అమెరికా అధికార వర్గాలు భారత్‌కు చెప్పాయని ఆయన తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు తాము కట్టుబడి ఉన్నామని బుష్ వాజ్‌పేయికి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపేయాలని, జమ్మూ కాశ్మీర్‌ఎన్నికలను విచ్ఛిన్నం చేయడానికి హింసను రెచ్చగొట్టవద్దని పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తానన బుష్ హామీ ఇచ్చినట్లుమిశ్రా చెప్పారు.