భూత్‌ బంగ్లాపై పెరిగిన ఆసక్తి!

హైదరాబాద్‌: మిస్టరీ హత్యలు వెలుగులోకి రావడంతో కుందన్‌ బాగ్‌ లోని ఆ భూత్‌ బంగ్లాను చూడడానికి ప్రజలు తరలివచ్చారు. ఈ హత్యలు నగర ప్రజల్లో ఒకరకమైన కుతూహలాన్ని రేపాయి. నగరం నడిబొడ్డులో సినిమాల్లో మాదరిగాదెయ్యాల కొంప ఉంటుందా అని ఆసక్తితో నగరవాసులు అనేక ప్రాంతాల నుంచి కుందన్‌ బాగ్‌ కు వచ్చారు.


ఎం.సి.ఎచ్‌ ఈ ఇంటికి ఇచ్చిన నెంబర్‌ 63122/9/బి. కానీ స్థానికులు మాత్రం దీన్ని భూత్‌ బంగ్లాగానే పరిగణిస్తారు. ఆఖరికి పోలీసులు కూడా ఈ ఇంటివైపు వెళ్ళేందుకు భయపడిపోయేవారు. ఈ ఇంటి యజమానురాలు జయప్రద(56) ధనవంతురాలే కాదు మానసిక రోగి కూడా.

వచ్చిపోయే వారి అందర్నీ భయపెట్టించేది. రాళ్ళువిసిరి కొట్టేది. రక్తపు బాటిళ్ళతో చుట్టుపక్కల వారిని భయపెట్టేది. ఈమెకు తోడుగా ఇద్దరు కూతుళ్ళు కూడా ఇలానే ఉండేవారు.వీరు ముగ్గురు విపరీత ప్రవర్తనతో అందరికీ దూరమయ్యారు.

ఈ విపరీత ప్రవర్తనే వారి మరణానికి కారణం అయ్యే అవకాశం ఉందని ఒక వాదన. కానీ ఆస్తి తగాదాలు కూడా కారణం కావొచ్చనే పాయింట్‌ కూడావిన్పిస్తోంది. కుందన్‌ బాగ్‌ లోని ఆ ఇల్లు కోట్ల రూపాయలవిలువ చేస్తుంది.

అలాగే బంజారాహిల్స్‌ లో కూడా ఆస్తి ఉంది. మగపురుగుఅంటూ ఈ ఇంటి ఛాయలకు రాని భూత్‌ బంగ్లా కథ అచ్చు తెలుగు సినిమా కథలాగా ఉండడంతో మీడియా కూడా ఈకేస్‌ పై దృష్టి సారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+