మిస్టరీ చావులపై వీడనిమిస్టరీ!
హైదరాబాద్: హైదరాబాద్ లో సంచలనం సృష్టించినకుందన్ బాగ్ మిస్టరీ మరణాలనపై ఇంకా మిస్టరీ వీడలేదు. శనివారం హైసెక్యురిటీ జోన్ కుందన్ బాగ్ లోని ఓ ఇంట్లో బయటపడ్డ ముగ్గురు మహిళల శవాలపరిశోధనలో ఆదివరాం కూడా పురోగతి కనిపించలేదు. మూడు నెలల క్రితంవీరి చనిపోయి ఉంటారని మాత్రం పోలీసులు తేల్చారు.
మూడు నెలలుగా ఈ వీరి మరణం గురించి బయటపడకపోవడం ఒక విచిత్రమైతే, మూడు నెలలుగా దొంగలువీలైనప్పుడల్లా అందినంతా దోచుకుపోతున్నా...ఆ ప్రాంతలో నిత్యం కాపలా కాసే పోలీసులు పట్టుకోకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.
పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొనిపరిశోధన సాగిస్తున్నప్పటికీ- అసలు ఇంతకీ వీరి హత్యకు గురయ్యారా లేక ఆత్మహత్యకు చేసుకున్నారా అనేవిషయంలో పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు.పోస్ట్ మార్టమ్ నివేదిక అందితేగానీ ఏ విషయం తేలదని వారుఅంటున్నారు.
తల్లీ కూతుళ్ళైన జయప్రద( 56), సుధ(33), శారద(29) ఈ మహిళల శవాలపై ఆచ్ఛాదన లేకపోవడం వల్ల ఇది హత్యే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినా, వారి మానసిక స్థితి వల్ల ఆత్మహత్య అయ్యే అవకాశాలు లేకపోలేదని మరో వాదన.












Click it and Unblock the Notifications
