కాశ్మీర్ మంత్రిపై హత్యాయత్నం!
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పర్యాటక శాఖ మంత్రి సకీనా ఇటూపై ఆదివారంమిలిటెంట్లు దాడి చేశారు. ఈ హత్యాయత్నం నుంచి ఆమె తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గోని వస్తోన్న ఆమె వాహనంపై తీవ్రవాదులు బాంబులుపేల్చారు. అలాగే కాల్పులు జరిపారు. ఆమెకు ఎటువంటిఅపాయం జరగలేదు. కానీ ఈ ఘటనలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ మరణించాడు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతనాగ్ జిల్లాలోని దేనావ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గత ఐదురోజుల్లో ఆమెపై దాడి జరగడం ఇది రెండోసారి. కాశ్మీర్లో ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు శతథా ప్రయత్నిస్తోన్న తీవ్రవాదులు గత వారం కాశ్మీర్ న్యాయశాఖ మంత్రి ముస్తాక్ అహ్మద్ లోన్ ను కాల్చిచంపారు.
మరో వైపు సోమవారం జరగనున్న తొలిదశ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల ప్రధాన కమీషనర్ జె.ఎం.లింగ్డో తెలిపారు.కాశ్మీరీ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయనవిజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలోఅందరూ పాల్గొనాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications
