సీఎంపై వైస్ సెర్చిలైట్
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలపైసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి దృష్టి సారించారు. వాగ్గానం చేసి పనులు జరగని కార్యక్రమాలను బయటపెట్టేందుకు వై.ఎస్ సోమవారం నుంచి జిల్లాల పర్యటన జరుపుతారు. తొలుత కర్నూలుజిల్లాతో శ్రీకారం చుడుతారు. ఆదివారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో ఆయన తన పర్యటన కార్యక్రమాన్నివివరించారు.
ఎనిమిది జిల్లాల్లో పర్యటించి చంద్రబాబు వాగ్ధానాల వైఫల్యాలను ఎండగడుతారు.ఎన్నికల్లో మాట మీద మాట ఇచ్చి...మూడేళ్ళు అవుతున్నా వందల కార్యక్రమాలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. శంకుస్థాపన చేసిన పథకాలైతే అడుగు ముందుకు కదలడం లేదని వై.ఎస్.విమర్శించారు.
జన్మభూమి, ఆపద్భాందు, శ్రమదానం, నీరు-మీరు వంటి కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వాగ్ధానాలలిస్ట్ ను వై.ఎస్. చూపించారు. ఆయా జిల్లాలో చంద్రబాబు చేసిన హామీలను అక్కడే తెలిపి..వాటిపురోగతి ఏమిటో ప్రజలకు వివరిస్తానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications
