వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాలతో చర్చించాకే ఐ.డికార్డ్స్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేషనల్‌ ఐడెంటిటీ కార్డ్స్‌ జారీవిషయంలో రాష్ట్రాలతో మరో మారు చర్చలు జరుపుతామని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ తెలిపారు. దేశంలోని పౌరులందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వాలనేది కేంద్రం యోచన. అయితే ఈవిషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని అద్వానీ బుధవారంవిలేకరులకు తెలిపారు. ఐ.డి. కార్డులు జారీ చేయాల్సింది రాష్ట్రాలే.అందుకే అన్ని రాష్ట్రప్రభుత్వాలతో ఏకాభిప్రాయ సాధనకు కృషిచేస్తున్నామని ఆయన అన్నారు. ఇదివరకు ఒక సారి కేంద్రం ముఖ్యమంత్రులతో సమావేశం జరిపి ఈవిషయమై చర్చింది.

ఈ సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు అభ్యంతరం తెలిపారు. శాంతిభద్రతలతో పాటు శరణార్థుల వలసలను నిరోధించేందుకు ఈ గుర్తింపు కార్డుల జారీ తప్పనిసరి అని ఆయన అన్నారు. మల్టీ పర్పస్‌ కార్డ్‌ గా దీన్ని మలుస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X