కాశ్మీర్ లో హింస; 13 మంది మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు చెలరేగిపోయారు. కాశ్మీర్ లో వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి జరిపిన దాడులు, కాల్పుల్లో 13 మంది మరణించారు. మరణించిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఇద్దరు నాయకులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనగర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ బ్లాక్ కార్యదర్శి అలీ మొహమద్ దార్ ను తీవ్రవాదులు కాల్పిచంపారు. ఆయన నివాసంలోకి జొరబడి గుర్తుతెలియనితీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు.












Click it and Unblock the Notifications
