కర్నూలు జిల్లాలో ఇద్దరు హతం
కర్నూలుః కర్నూలు జిల్లాలో నక్సలైట్లు విజృంభించారు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేత బంధవును, అతని అనుచరుడ్ని నరికి చంపారు. మంగళవారమే ఈ సంఘటన జరిగినప్పటికీ బుధవారం ఉదయానికి కానీ వెలుగుచూడలేదు. భవనాశిదళం ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు రోజుల కిందటే ఆత్మకూరు మండలంలో భారీ సమావేశం నిర్వహించింది.
అది జరిగిన రెండో రోజునే అధికార పార్టీకి చెందిన వారి అనుయాయులపై నక్సలైట్లు గురిపెట్టడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఆత్మకూరు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
