వై.ఎస్. ఖైదీని కలవడంపై రగడ
కర్నూలు: కర్నూలు సబ్ జైల్ లో జీవిత ఖైదును అనుభవిస్తోన్న గౌరు వెంకటరెడ్డినిసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పరామర్శించడాన్ని తెలుగుదేశం తప్పుపట్టింది. హత్యకేసులో శిక్షను అనుభవిస్తోన్న వ్యక్తి నిసీఎల్పీ నేత కలవడాన్ని బట్టి కాంగ్రెస్ సంస్కృతి ఏమిటో తెలిసిపోయిందని టీడీపీ నేతలువిమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ నేరమయ రాజకీయాలకు పాల్పడుతోందని మరోసారి దీని ద్వారా రుజువైందని కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించాడు. జంట హత్య కేసులో శిక్షను అనుభవిస్తోన్న వ్యక్తిని బాగా చూసుకోండని అధికారులను ఆయన కోరడం మరీ విచిత్రంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications
