శ్రీనగర్: శ్రీనగర్‌లోని పోలీసు కాలనీలో ప్రవేశించిన ఒకమిలిటెంట్‌ను పోలీసులు చంపారు. మరో మిలిటెంటు పారిపోయాడు. దీంతో శనివారం రాత్రి మొదలైన ఎన్‌కౌంటర్ ఆదివారం ఉదయం ముగిసింది.
ఇద్దరు ఆత్మాహుతి తీవ్రవాదులు పోలీసు దుస్తుల్లో పోలీసు కాలనీ వద్ద కాపలా ఉన్న గార్డ్‌లను హత్య చేసి లోనికి ప్రవేశించారు.మిలిటెంట్ల దాడిలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మరణించిన తీవ్రవాది వద్ద ఉన్న ఒక ఆటోమేటిక్‌రైఫిల్‌ను, రెండు గుర్తింపు కార్డులను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. పోలీసు కాలనీ ప్రవేశ ద్వారం వద్దకు పోలీసు దుస్తుల్లో చేరుకున్న తీవ్రవాదులు గార్డులపైకి గ్రెనేడ్లు విసిరారు; కాల్పులు జరిపారు. అనంతరం లోనికి ప్రవేశించారు. ఇద్దరుమిలిటెంట్లలో ఒకరు మృతి చెందగా మరొకతను చీకటిలో పారిపోయాడు.