ఇళ్లకు కరెంట్‌ కోత: ఖరీఫ్‌కు సర్దుబాటు

హైదరాబాద్‌: రాష్ట్రానికి కరువు సహాయంఅందించడంలో జాప్యం చేయడం పట్ల కేంద్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అలక వహించారు. కేంద్రం తీరుపై చంద్రబాబు ఆదివారం జరిగినవిద్యుచ్ఛక్తి శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు.

కరువు సహాయక చర్యలపై కేంద్రం స్పందించకపోవడంవిచారకరమని, కరవు పరిస్థితుల అధ్యయానికి కేంద్రం బృందం రావడమే ఆలస్యంగా వచ్చిందని, వచ్చి పోయిన తర్వాత కూడా సహాయంఅందించడం లేదని ఆయన అన్నారు.రాష్ట్రంలో గృహావసరాలకు 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు. జలాశయాల్లో నీటి మట్టాలు తగినంతగా లేకపోవడం వల్ల జలవిద్యుదుత్పత్తి పడిపోయిందని, ఈ స్థితిలో గృహావసరాలకు కరెంట్‌ సరఫరాలో కోత విధించి వ్యవసాయానికి సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఖరీఫ్‌సీజన్‌లో రైతులకు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేయడానికి గృహావసరాలకు కోతపెట్టక తప్పదని ఆయన అన్నారు. వ్యవసాయానికి రోజుకు తొమ్మిది గంటలు రెండు విడతలుగా కరెంట్‌అందిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా సక్రమంగా జరగడానికి సంబంధింత అధికారులు జిల్లాల్లో పర్యటించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రానికి 48 టిఎంసిల నీరు అవసరం కాగా నాగార్జునసాగర్‌,శ్రీశైలం రిజర్వాయర్లలో 17 టిఎంసిల నీరు మాత్రమే ఉన్నదని ఆయన చెప్పారు.కర్ణాటక కృష్ణానదిమిగిలు జలాలను కొంత మేరకైనా విడుదల చేస్తే మన రాష్ట్రానికి ఇంత ఇబ్బంది ఉండేది కాదని ఆయన అన్నారు. దక్షిణాది గ్రిడ్‌ నుంచి కర్ణాటక ఎక్కువవిద్యుత్తును వాడుకోకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+