కావేరీపై కర్ణాటకకు కేంద్ర బృందం

న్యూఢిల్లీ: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసేవిషయమై పరిశీలించడానికి కేంద్ర బృందం కర్ణాటకలో పర్యటించనుంది. ఈ కమిటీ మూడు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

కావేరీ రివర్‌ అథారిటీలో నీటి జలాలకు సంబంధించి కొన్ని షరతులున్నాయని, ఇప్పుడు తమిళనాడుకు జలాలు విడుదల చేస్తే కర్ణాటకలోని జలాశయాలు 45 రోజుల్లో ఎండిపోతాయని కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ అన్నారు. జలాశయాల్లోకి నీటి ప్రవాహానికి, జలాశయాల్లో నీటి నిల్వకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయని, ఈ నిబంధనల మేరకు తాము నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఈ నిబంధలను అధ్యయనం చేయడానికి, జలాశయాల్లో నీటి నిల్వను పరిశీలించడానికి కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్లుతుంది. ఇది ప్రజాస్వామ్యమని, కర్ణాటక తమకు నీటిని విడుదల చేసేలా చేయడానికి రాజ్యాంగం ప్రకారం కొన్ని వేదికలున్నాయని, ఆ వేదికలను అన్నిటినీ వాడుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. ఈ మేరకు తాము సుప్రీంకోర్టులో కర్ణాటకపై కోర్టు ధిక్కారం కింద కేసువేశామని, ప్రధానిని కలిసి విన్నవించామని ఆమె చెప్పారు.

కావేరీ జలాల వివాదంలోకి శాంతి భద్రతల సమస్యను తేవద్దని కేంద్రం కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకువిజ్ఞప్తి చేసింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+