కాశ్మీర్‌లో పేలుడు: ఇద్దరు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోనికుప్వారా జిల్లా లిస్తియాల్ గ్రామంలో సంభవించిన పేలుడులో ఇద్దరు మరణించారు, ఒక తీవ్రంగా గాయపడ్డారు. తరీఖ్ అహ్మద్ (14), ఫయాజ్ అహ్మద్ భట్ (10), నిస్సార్ అహ్మద్ లోన్ (8) బంతి మాదిరిగా ఉన్న పేలుడు పదార్థంతో ఆడుతుండగా అదిపేలింది.
ఇదిలా ఉండగా, కాశ్మీర్ లోయలో మిలిటెంట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇంటిపై రెండురైఫిల్ గ్రెనేడ్స్ పేల్చారు. పోలీసు పార్టీపై దాడి చేశారు. మరో సంఘటనలోమిలిటెంట్లు వాటూరా వద్ద పోలీసు వాహనంపై కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications
