వరంగల్: వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సిపిఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్లు హతమయ్యారు.
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో గ్రేహౌండ్స్ పోలీసులకు, జనశక్తి నక్సలైట్లకు మధ్య ఆదివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ పాటు నలుగురు నక్సలైట్లు మరణించారు. మరణించిన నక్సలైట్లు ముర్కంచ దళ సభ్యులని భావిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు తుపాకులను, తొమ్మిది కిట్ బ్యాగులను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.