ఎన్‌సి

పాట్నా: ఎన్నికల అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో తాము పొత్తుపెట్టుకునే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలోని జమ్మూ, లడక్‌ల పట్లవివక్ష ప్రదర్శిస్తోందని ఆయన సోమవారం ఇక్కడవిమర్శించారు.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో వివిధఅంశాలపై తమకు తీవ్రమైన విభేదాలున్నాయని,అందువల్ల ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని, ప్రస్తుత ఎన్నికల్లో పరస్పరం పోటీ పడుతున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిఅయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో ఏయే అంశాలపై విభేదాలున్నాయనేవిషయాలను ఆయన వెల్లడించలేదు. కేంద్రంలో ఇరు పార్టీల మధ్య అవగాహన కొనసాగుతుందని ఆయన చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజించాలంటున్నవారితో చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. వేర్పాటువాదులైన హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలతో, కాశ్మీర్‌లోయలోని తీవ్రవాదులతో చర్చలు జరిపినప్పుడు జమ్మూ కాశ్మీర్‌ విభజనను కోరుతున్నవారితో ప్రభుత్వం చర్చలు జరపడంలో తప్పు లేదని ఆయన అన్నారు.

ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గౌరవ యాత్రను రద్దు చేసుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌ ప్రశాంతంగా ఉన్నదని, అక్కడ ఉద్రిక్తతలు గానీ, అల్లర్లు గానీ లేవని, ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన భయాందోళనలను దృష్టిలోపెట్టుకుని ఇప్పటికే రెండు సార్లు గౌరవయాత్రను వాయిదా వేశామని వెంకయ్యనాయుడు అన్నారు.

పెట్టుబడుల ఉపసంహరణపై గానీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులఅనుమతిపై గానీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)మంత్రుల్లో భేదాభిప్రాయాలు లేవని, వాటిని అమలు చేసే తీరుపైస్వల్ప విభేదాలున్నాయని ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+