పాస్ పోర్ట్ ల రీవెరిఫికేషన్ : దేవేందర్
హైదరాబాద్: క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వ్యక్తల పాస్ పోర్ట్ ల రీవెరిఫికేషన్ జరుపుతామని రాష్ట్ర హోంశాఖ మంత్రి టి.దేవేందర్ గౌడ్ తెలిపారు. కర్నూలు పాస్ పోర్ట్ ల డెన్ గా మారడంతో రాష్ట్రప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. అబూసలెం బృందానికి పాస్ పోర్ట్ లను జారీ చేసిన సంబంధిత అధికారులపై చర్య తీసుకున్నట్లు దేవేందర్ గౌడ్ సోమవారంవిలేకరులకు చెప్పారు.
పాస్ పోర్ట్ ల జారీ కోసం వసూలు చేస్తోన్న ఫీజులో కొంత మొత్తం రాష్ట్ర పోలీసు శాఖకుఅందచేయాలని కేంద్ర హోంశాఖను కోరినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల పోలీసులు సమగ్రంగా వెరీఫికేషన్ చేయడానికి వీలవుతుందన్నారు.












Click it and Unblock the Notifications
