రాష్ట్రంలో 3 గంటలు కరెంట్ కోత
హైదరాబాద్: రాష్ట్రంలోవిద్యత్ కోత అమలులోకి వస్తోంది. గ్రామాల్లో గృహావసరాలకు 24 గంటలువిద్యుత్తు సరఫరా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. ఇకనుంచి రాష్ట్రంలో రోజుకు మూడు గంటలు విద్యుత్ కోత అమలవుతుందనివిద్యుచ్ఛక్తి శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సోమవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.
రోజుకు 160 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగాల్సి ఉండగా, 136 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని, డిమాండ్ 140మిలియన్ యూనిట్లు ఉన్నదని ఆయన చెప్పారు. దక్షిణ గ్రిడ్ నుంచి రాష్ట్రానికి రావాల్సినవిద్యుత్ కూడా తగ్గిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
