హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలకు మల్టీమోడల్‌రైల్వే ట్రాన్సిట్ సిస్టం నాలుగు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ సిస్టం పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్షించారు.
సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు లైట్‌రైల్ సిస్టమ్ కోసం కొత్తగా పది స్టేషన్లు నిర్మిస్తున్నారు.వీటి పనులను ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ పరిశీలించారు. పనుల జాప్యం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రూ. 70 కోట్లతో మొదటి దశ పనులు అమలు చేస్తున్నారు. రెండో దశలో పారిశ్రామిక వాడలకు, జంటనగరాల చుట్టుపక్కల ఉన్న జిల్లాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అవసరమైతే ప్రయివేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.