ఆలయంలోకి తీవ్రవాదులు- ఎన్‌కౌంటర్‌

గాంధీనగర్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గలస్వామి నారాయణ దేవాలయంలోకి మంగళవారం సాయంత్రం ఇద్దరు తీవ్రవాదులు ప్రవేశించారు. దేవాలయాన్ని వెంటనే కమెండోలుచుట్టుముట్టారు. ఈ సంఘటనలో మిలిటెంట్లువిచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు మరణించి వుంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే వుండవచ్చునని అనుమానిస్తున్నారు. దాదాపు 40 మందిగాయపడ్డారు.

కనీసంఎనమండుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్వామి నారాయణమందిరం రాష్ట్ర సచివాలయానికి కేవలం రెండు కిలోమీటర్లదూరంలోనే ఉంది. లోనికి చొరబడినమిలిటెంట్లు ప్రాంగణంలో ఎక్కడ ఉన్నారనే విషయం తెలియడం లేదు. దేవాలయ ప్రాంగణం తలుపులన్నీ మూసేశారు.

పరిస్థితిని కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీస్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ విషయమై మాల్దీవుల్లో ఉన్న ప్రధాని వాజ్‌పేయికి ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ముఖ్యమంత్రి నరేంద్రమోడి అత్యవసర మంత్రి వర్గం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.మిలిటెంట్లు చొరబడిన స్వామి నారయణ మందిరం మంత్రుల ఇళ్లకు అతి సమీపంలో ఉంది. దేవాలయంలోకి చొరబడినమిలిటెంట్లు ఇద్దరా, ముగ్గురా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. దేవాలయం నుంచి 75 మంది భక్తులను రక్షించగలిగారు.

తీవ్రవాదులకు, కమెండోలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. ఈ సంఘటనలో 25 మంది గాయపడినట్లు సమాచారం. ఈ తీవ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనేది తెలియదు. మంగళవారం సాయంత్రం గం.5.20 నిమిషాల ప్రాంతంలోస్టెన్‌గన్‌లు ధరించిన తీవ్రవాదులు దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో దేవాలయ ప్రాంగణంలో 100 నుంచి 150 మంది భక్తులు ఉంటారనిఅంచనా.

దేవాలయం 22 ఎకరాల స్థలంలో విస్తరించి వుంది. తీవ్రవాదులు ఒకటో నెంబర్‌ గేటు నుంచి లోనికి ప్రవేశించారు. ఈ దేవాలయం గుజరాతీలకు అత్యంత పవిత్రమైంది; ప్రసిద్ధమైంది కూడా. ప్రవాసభారతీయులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయం వద్దకుఅంబులెన్స్‌లు కూడా చేరుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+