జమ్మూకాశ్మీర్‌లో 42 శాతం పోలింగ్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం 28 శాసనసభా నియోజకవర్గాలకు జరిగినపోలింగ్‌లో 42 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జమ్మూతో పోలిస్తే శ్రీనగర్‌లో పోలింగ్ తక్కువగా జరిగింది.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జరిగిన ఎన్‌కౌంటర్ మధ్య పోలింగ్ తక్కువగా జరిగిందని భావిస్తున్నారు. బుద్గాం జిల్లాలోను, జమ్మూలోను పోలింగ్ ఎక్కువగా జరిగింది.
భారీ అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదని, దాదాప పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి ప్రమోద్ జైన్ చెప్పారు. బద్గాం జిల్లాలోని చందూరా నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌పై దాడి చేయడానికి సాయుధమిలిటెంట్లు విఫల యత్నం చేశారు. మంగళవారం పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పోటీలో ఉన్నారు.
ప్రధాని ప్రశంస
మాలే: ప్రాణాలకు తెగించి ఓట్లు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చినందుకు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జమ్మూ కాశ్మీర్ ప్రజలను కొనియాడారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలను మాల్దీవుల పర్యటనలో ఉన్న ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications
