ముషార్రఫ్‌పై మండిపడ్డ వాజ్‌పేయి
మాలే: జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్నికలు బూటకమని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్‌పై భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మండిపడ్డారు. ముషర్రాప్ ప్రచారాన్ని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఆయన అన్నారు.
మాల్దీవులు, భారత్ సంయుక్తంగా తీవ్రవాదాన్ని ఎదుర్కుంటాయని, కోరితే మాల్దీవుల అధికారులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. సార్క్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పటిష్టం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని, ముఖ్యంగా వాణిజ్యంలో ఈ సహకారంపెంపొందించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
