బీజింగ్‌ః ఉత్తర చైనా లోని మంగోలియా ప్రాంతంలో ఒక స్కూల్ మెట్లు కూలి 21మందివిద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఫెంగ్జెన్ పట్టణంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.
స్కూల్ నుంచి పిల్లలంతా ఒక్కసారిగా బయటకు వస్తున్న సమయంలో మెట్లు హఠాత్తుగా కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.