గుజరాత్‌ గుడిపై దాడి -36మంది బలి

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ లోని నారాయణస్వామి ఆలయం అక్షరధామ్‌ పై మిలిటెంట్లు దాడి చేశారు. ఈదాడిలో 36 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ సంఘటనలో 44 మంది దాకా మరణించి వుంటారని అనధికార వర్గాలఅంచనా. కనీసం 80 మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి నుంచి ఆలయంలో వున్న తీవ్రవాదులు, ఢిల్లీ నుంచి వచ్చిన కమెండోల మధ్య భీకర పోరాటం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కమెండోలు ఆలయంలో వున్న ఇద్దరు తీవ్రవాదుల్ని హతమార్చి ఆలయాన్నిస్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం రాత్రి ఆలయం హారతి ఇస్తున్న సమయంలో బాంబులు, ఇతర మారణాయుధాలతో తీవ్రవాదులు ఆలయంలో ప్రవేశించివిచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆలయాన్ని చుట్టుముట్టారు. ఉపప్రధాని అద్వానీ వెంట ప్రత్యేక కమెండోలు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆలయంలో వుండి కాల్పులు జరుపుతున్న తీవ్రవాదుల్ని చుట్టుముట్టారు. రాత్రి తెల్లవార్లూ ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఆలయాన్నిస్వాధీనం చేసుకొని, 29 మందిని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులు 13 గంటల పాటు పోరాడి కమెండోల తూటలకు బలయ్యారు. ఈ సంఘటనతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి లోనైంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+