ఆలయం రక్తసిక్తం-పాక్ ప్రమేయం
గాంధీనగర్‌ః గుజరాత్ రాజధాని నగరంలోని నారాయణ్ ఆలయం రక్తసిక్తంఅయింది. బుధవారం ఉదయం మిలిటెంట్లను హతమార్చిన వెంటనే ఉపప్రధాని ఎల్.కె. అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భక్తుల మృత దేహాలు, నెత్తుటి చారలతో ఆలయంలోని దృశ్యాలు భీతావహంగా వున్నాయి. ఆలయంలోని దాదాపు అన్ని గదులను అద్వానీ పరిశీలించారు. కాల్పులు జరుపుకుంటూమిలిటెంట్లు రావడాన్ని గమనించిన వాలంటీర్లు ఆలయ ప్రధాన ద్వారం మూసి వుండకపోతే ఆలయంలో వున్న వందలాది మంది కూడా మరణించే వారనిఅర్చకుల్లో ఒకరు చెప్పారు.












Click it and Unblock the Notifications
