అద్వానీ రాజీనామాకుడిమాండ్
గోరఖ్‌పూర్: గుజరాత్‌లోని గాంధీనగర్‌స్వామినారాయణ దేవాలయంపై తీవ్రవాదుల దాడికి బాధ్యత వహించి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించినా తీవ్రవాదాన్ని అంతం చేయడంలో వాజ్‌పేయి ప్రభుత్వంవిఫలమైందని ఆయన విమర్శించారు.
బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) ఈ నెల 28వ తేదీన లక్నోలో తలపెట్టిన ర్యాలీకిహాజరు కావడానికి అద్వాన్నీ అంగీకరించడాన్ని ఆయన తప్పు పట్టారు. తమ మంత్రివర్గ సహచరుడు రాసినపాల్స్ గాడ్స్ అనే పుస్తకాన్ని అద్వానీ ఆవిష్కరించారని, ఆ పుస్తకంలో శౌరీ అంబేడ్కర్‌ను దుమ్మెత్తిపోశారని, బిఎస్‌పి ర్యాలీకి అద్వానీ రావడం అంబేడ్కర్ అనుచరులను సంతోషపెట్టడానికేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
