ఇస్లామాబాద్: గుజరాత్‌లోనిస్వామినారాయణ దేవాలయంపై జరిగిన దాడి వెనక తాము ఉన్నట్లు భారత్ చేసిన ప్రకటనను పాకిస్థాన్ ఖండించింది.
భారత్ ప్రకటన హాస్యాస్పదమైంది,అర్థరహితమైందని పాకిస్థాన్ సమాచార మంత్రి నిసార్ మెమొన్ అన్నారు. భారతీయులు సంయమనం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోనిస్వామినారాయణ దేవాలయంపై దాడి వెనక పాకిస్థాన్ పాత్ర ఉండవచ్చునని భారత ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. మతోన్మాదాన్ని, హిందూ దురహంకారాన్ని భారత నేతలు కట్టడి చేయాల్సి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. తమపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆయనఅన్నారు.