సిటీ శివారులో ముసుగుదొంగల దోపిడి

హైదరబాద్‌: హైదరాబాద్‌ శివార్లలో ముసుగు దొంగలు మంగళవారం అర్థరాత్రివీరంగం చేశారు. నాచారం పోలీసు స్టేషన్‌ పరిధిలోని చెంగిచర్లలో పలు ఇళ్లపై ఈ ముఠా సభ్యులు దాడి చేసి మారణాయుధాలతో బెదిరించి బంగారం, నగదు దోచుకుపోయారు.

ఆలీవ్‌ గ్రీన్‌ దుస్తులు ధరించిన ఏడుగురు సభ్యుల ముఠా ఒక చోట దొంగలమని, మరో చోటఅన్నలమని బెదిరించి అందినంత దోచుకుపోయారు. అయితేవీరు ఎవరికీ అపాయం తలపెట్టలేదు. వారి వద్ద రివాల్వర్లు, వేటకొడవళ్లు, గొడ్డలి, బాంబులు ఉన్నాయని బాధితులు చెప్పారు. రాజాచారి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి అతని పిల్లలను బెదిరించి 12 తులాల బంగారం, నగదు దోచుకున్నారు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రాజాచారి దంపతులను కూడా బెదిరించి దోచుకున్నారు.

ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంటిపై దాడి చేసి తాము అన్నలమని చెప్పి 34 వేల రూపాయల నగదు, 20 తులాల బంగారం దోచుకుపోయారు. ఆ తర్వాత మరో మూడు ఇళ్లపై కూడా దాడి చేశారు. కానీ ఒక మంగళసూత్రం, కొద్ది మొత్తం నగదు మాత్రమే ఈ ఇళ్లలో వారికి దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+