వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకం ప్రకారమే గుడిపై దాడి: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్‌: ఉగ్రవాదంపై పోరు మరింత కొనసాగుతుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రకటించారు. మాల్దీవుల నాలుగు రోజుల పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఆయన బుధవారం సాయంత్రం గుజరాత్‌లోని గాంధీనగర్‌ చేరుకున్నారు. తీవ్రవాదులు దాడి చేసినస్వామినారాయణ దేవాలయాన్ని సందర్శించారు. తీవ్రవాదుల దాడిలో 36 మంది మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.

పకడ్బందీ పథకం ప్రకారమేస్వామినారాయణ దేవాలయంపై తీవ్రవాదులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటన నేపథ్యంలో సహనంతో వ్యవహరించాలని, మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన గుజరాత్‌ ప్రజలకువిజ్ఞప్తి చేశారు. తీవ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్‌ శాసనసభ ఎన్నికలనువిచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు సాగకపోవడంతో ఇటువంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. ఆలయంలో ప్రవేశించిన తీవ్రవాదులను హతం చేయడంలో భద్రతా బలగాలు ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాయని ఆయన కొనియాడారు.

ఈ దారుణ సంఘటనలో నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి తన నాలుగవ విడత గౌరవయాత్రను రద్దు చేసుకున్నారు.

స్వామినారాయణ దేవాలయంపై తీవ్రవాదుల దాడికి నిరసనగా గురువారం తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ సందర్భంగా శాంతిని పరిరక్షించాలనివిశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) పిలుపునిచ్చింది. ఇటువంటి జాతీయ వ్యతిరేక కార్యకలాపాలనకు వ్యతిరేకంగా ముందుకు రావాలని విహెచ్‌పి జాతీయ ఉపాధ్యక్షుడు వై.కె. రాఘవేంద్రరావు ముస్లింలకువిజ్ఞప్తి చేసింది. నిస్సహాయ స్థితిలో నిస్పృహతో పాకిస్థాన్‌ ఈ దారుణానికి పాల్పడిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. స్వామి నారాయణ దేవాలయంపై జరిగిన దాడిని అఖిల భారతపర్సనల్‌ లా బోర్డు ఖండించింది. దేవాలయంపై దాడి చేసి భక్తులను చంపడాన్ని అమానుష చర్యగా వ్యాఖ్యానించింది.

తీవ్రవాదుల దాడిలో 36 మంది బలైన స్వామినారాయణ దేవాలయాన్ని ప్రతిపక్ష నేత సోనియాగాంధీ బుధవారం సందర్శించారు. ఆమె వెంట కాంగ్రెస్‌ నాయకుడు మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X