ఇంటలిజెన్స్ సంస్థలకు అద్వానీ సూచనలు
న్యూఢిల్లీ: నిర్దిష్టమైన సమాచారాన్నిఅందజేయడానికి ప్రయత్నించాలని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలకు సూచించారు. నిర్దిష్టమైన సమాచారంఅందించినప్పుడు మాత్రమే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
స్వామినారాయణ్ దేవాలయానికి 45 మంది ఎన్‌ఎస్‌జి కమెండోలను పంపినివిషయాన్ని ప్రస్తావిస్తూ- వారు చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు ఆలస్యమైందని, ఢిల్లీలో ట్రాఫిక్‌జామ్ వల్ల వారు విమానాశ్రయానికి చేరుకోవడంలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు.
ఈ విధమైన పరిస్థితులను అధిగమించడానికి మార్గాలు వెతకాలని, ఈ సందర్భంలోపెద్ద నష్టం జరగలేదని, అయితే ఈ విధమైన జాప్యం వల్ల నష్టాలుపెద్దగా జరిగే ప్రమాదం ఉండవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
