డిసిల్వా రిటైర్మెంట్ అభివాదం
కొలంబో: తనరిటైర్మెంట్‌ను ప్రకటించిన శ్రీలంక బ్యాట్స్‌మన్‌అరవింద డిసిల్వా ఆదివారం ప్రేమదాస స్టేడియంలోని ప్రేక్షకులకు అభివాదం చేశారు. భారత్‌తో జరుగుతున్న ఐసిసి ఛాంపియన్ ట్రోఫీఫైనల్‌లో అవుటయిన అనంతరం ఆయన ప్రేక్షకులకు అభివాదం చేసిపెవిలియన్ దారి పట్టారు.
శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న ఐసిసి ఛాంపియన్ ట్రోఫీఫైనల్‌ను వీక్షించడానికి బాలీవుడ్ నటులు కూడా వచ్చారు. సునీల్ శెట్టి, ఫర్దీన్‌ఖాన్ వంటి నటులు మ్యాచ్ చూడడం కనిపించింది. సునీల్ శెట్టి సోనీ మాక్స్ నిర్వహిస్తున్నఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌లో కూడా పాల్గొన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఐదువికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక బ్యాట్స్‌మన్ తర్వాత భారత్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు.












Click it and Unblock the Notifications
