హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్‌సి కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమవుతుంది. డిఎస్‌సి కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో మార్పు లేదని పాఠశాలవిద్యా మంత్రి మండవ వేంకటేశ్వరరావు ఆదివారంవిలేకరులతో చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో నాన్ లోకల్ కోటా భర్తీవిషయంలో చిక్కులు ఎదురయ్యాయని, దీంతో జాబితాల వెల్లడిలో కొన్ని జిల్లాల్లో కొంత జాప్యం జరిగిందని ఆయన అన్నారు. దీంతో జాబితాల వెల్లడి పూర్తిగా శనివారంనాడు పూర్తి కాలేదని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లాలో శనివారంనాడే జాబితాలను ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని చిక్కుల వల్ల రాత్రి పదిన్నర గంటలకు గానీ జాబితాలు వెల్లడి చేయలేకపోయారు.