కోయంబత్తూర్‌పేలుళ్ల నిందితుల కాల్చివేత
బెంగుళూర్: కోయంబత్తూర్ వరుస బాంబుపేలుళ్ల కేసులో నిందితులైన ఇమామ్ అలీని, అతని నలుగురు అనుచరులను తమిళనాడు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కాల్చివేశారు.కర్ణాటక, తమిళనాడు పోలీసులు సంయుక్త జరిపిన దాడి సందర్భంగా జరిగినఎన్‌కౌంటర్‌లో వారు మరణించారు. మరణించినవారిలో ఒక మహిళ కూడా ఉంది.
మధురై సమీపంలోని తిరుమంగలం పోలీసు స్టేషన్ వద్ద సాయుధమిలిటెంట్ల సహకారంతో అలీ, అతని అనుచరుడు హైదర్ అలీ మార్చి 7వ తేదీన పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు.అప్పటి నుంచి ఈ ముఠా కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ పోలీసులుపెద్ద యెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. పరారీఅయిన రెండు రోజుల తర్వాత హైదర్ అలీ హైదర్ అలీ పోలీసుల ముందు లొంగిపోయాడు.వీరు పారిపోవడానికి సహకరించిన 23 మందిని పోలీసులుఅరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
