ఉపసంహరణతోనే ఉద్రిక్తత సడలింపు
ఇస్లామాబాద్: భారత్ ప్రతిస్పందన సరిగా లేకపోవడం వల్లనే ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. సమస్య పరిష్కారానికి భారత్,పాక్, కాశ్మీర్ ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగాలని ఆయన అభిప్రపాయపడ్డారు.
ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని, అయితే ఇది భారత్ ఉద్దేశం వల్ల మాత్రమే జరుగుతోంది గాని దాని సామర్థ్యం వల్ల కాదని ఆయన యూరోపియన్ యూనియన్, స్కాండినేవియన్ దేశాల ప్రతినిధులతో అన్నారు. సరిహద్దుల్లో భారతసైన్యాలు మోహరించి ఉన్నంత కాలం ఉద్రిక్తత కొనసాగుతుందని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ పలు చర్యలు చేపట్టిందని, అయితేఅందుకు అనుకూలంగా భారత్ ప్రతిస్పందించడం లేదని ఆయన అన్నారు.
పాకిస్థాన్ భూభాగంలో తీవ్రవాద కార్యకలాపాలను సహించబోమని, ఆల్ ఖయిదా, తాలిబాన్‌మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇప్పటికే చర్చలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈవిషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతోపెకలించి వేసే పనికి పూనుకున్నామని ముషార్రఫ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
