లక్నో: చార్‌బాగ్ తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఇళ్లకు తిరిగి వెళ్లడానికి వేలాది మంది బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) కార్యకర్తలు ప్లాట్‌ఫారాలపై ఉన్నారు.
బిఎస్‌పి ర్యాలీ సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 16 మంది మరణించారు. యాభై మంది గాయపడ్డారు. ఈ సంఘటనపైవిచారణ జరపాలని ముఖ్యమంత్రి మాయావతి ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దర్యాప్తు అనంతరం ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.