హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో బందిపోట్లు మరోసారి స్వైర విహారం చేశారు. బందిపోట్లు ఒక వ్యక్తిని హత్య చేశారు. మొత్తం 8 ఇళ్లను దోచుకున్నారు. ఈ సంఘటన జీడిమెట్ల సమీపంలోని సూరారం గ్రామంలో జరిగింది.
బందిపోట్లు గస్తీలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను బంధించి, వారి వద్ద ఉన్న తుపాకులు లాక్కుని యధేచ్చగా దోపిడీకి పాల్పడ్డారు.వీరి దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. బందిపోట్లను చూసిన ఒక కుటుంబానికి చెందిన సభ్యులు తమ ఇంటి తలుపులు మూసేసుకున్నారు. అయితే బందిపోట్లు తలుపులనుపేల్చేసి లోనికి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.